ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.
హైదరాబాదు రవీంద్ర భారతిలో ఒక అపురూప కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమమే "వినబడే గొంతులు కనబడే వేళ" .ఈ విలక్షణ కార్యక్రమం వాచస్పతి ఆర్ట్స్ ఎకాడమీ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రస్తుత కళాకారులు అందులో ముఖ్యంగా అంబటిపూడి మురళీకృష్ణ గారు ముఖ్య పాత్ర వహించి విజయవంతంగా సాగించారు. ఆరోజున, ఆకాశవాణి కళాకారులందరూ, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ఊరేగింపుగా రవీంద్రభారతి కి వచ్చి అక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని జరుపుకున్నారు. తమకు ముందు ఆకాశవాణిలో పనిచేసి, పేరొందిన రేడియో కళాకారులను ఎందరినో "వాచస్పతి అవార్డులు" ఇచ్చి సత్కరించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ కప్పగంతు శివరామప్రసాదు ఆ కార్యక్రమంలో ప్రదర్శనలో ఉంచిన కొన్ని ఫోటోలను తన కెమెరాలో బంధించి మాకు మా వెబ్ సైటులో ఉంచటానికి పంపారు.
అలాగే తమకు అందుబాటులో ఉన్న ఫొటోలను అందించిన శ్రీ డింగరి దుర్గ గారికి, ఇన్నయ్య గారికి, స్వీయ చిత్రాలను అందించిన ఇలియాస్ అహ్మద్ గారికి, డాక్టర్ కె.బి.గోపాలం గారికి, సుధామ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
రేడియో కళాకారుల అభిమానులు ఎందరో వారి అభిమాన పాత్రులైన కళాకారుల గొంతులే విని ఉండి, వారెలా ఉంటారా అన్న ఆసక్తితో ఉండి ఉంటారు. అటువంటి రేడియో కళాకారుల అభిమానుల కోసం ఆ ఫోటోలను ఈ కింద ఇస్తున్నాము. ఈ ఫోటోలలో కొందరి పేర్లు తెలియవు. అవి తెలిసిన వారు మాకు తెలియచేస్తే ఎంతో కృతజ్ఞులం, ఆయా ఫోటోలలో వివరాలు పొందుపరచగలము.
మూడేళ్ళ క్రితం పి.డి.ఎఫ్ రూపంలో భద్రపరచుకున్న - డాక్టర్ అనంతపద్మనాభరావు గారు వ్రాసిన "ప్రసార ప్రముఖులు" (1996) అనే పుస్తకం ఇక్కడ పెట్టడానికి సాహసిస్తున్నాము . పుస్తక ముఖ చిత్రం ఇక్కడ చూడవచ్చు. అలాగే శ్రీ పన్నాల సుబ్రహ్మణ్యభట్టు గారి పుస్తకం "ప్రసార తరంగిణి" - రేడియో కార్యక్రమాల పై వ్యాస సంకలనం కూడా ఇక్కడ పెట్టటానికి సాహసిస్తున్నాము.
శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారి "రేడియో చెళుకులు" పుస్తకం కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ పుస్తకం పి.డి.ఎఫ్ రూపంలో అందించిన శ్యాం నారాయణ గారికి ధన్యవాదాలతో .
ఈ పుస్తకాలు గాని ఫోటోలనుగాని ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాము.
వివరాల కోసం, పేరు పక్కనే వున్న బొమ్మ మీద నొక్కండి
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
April 2009
|
ఎ.బి.ఆనంద్
|
అద్దంకి మన్నార్
|
ఏకాంబరం
|
ఎఐఆర్ విజయవాడ
|
బాలమురళీకృష్ణ
|
బాలాంత్రపు
|
చిన్నక్క
|
కోకా సంజీవరావు
|
రామ్మోహన రావు
|
గోవిందరాజు / ఎస్.వి.ఆర్
|
జె.మంగమ్మ
|
కపిల కాశీపతి
|
కె.చిరంజీవి
|
మల్లాది నరసింహ శాస్త్రి
|
మట్టపల్లి రావు
|
నాగరత్నమ్మ
|
వింజమూరి లక్ష్మి
|
నండూరి సుబ్బారావు
|
ఢిల్లీ న్యూస్ రీడర్స్
|
పుచ్చా సుబ్బారావు
|
రేడియో భానుమతి
|
రావూరి భరద్వాజ
|
ఋష్యేంద్రమణి
|
వనమాలి
|
వి.బి.కనకదుర్గ
|
ఉషశ్రీ
|
నాటక రిహార్సల్
|
దుర్గా భాస్కర్
|
హైమవతి భీమన్న
|
మాడపాటి సత్యవతి
|
తురగా జానకీరాణి
|
స్థానం
|
మునిమాణిక్యం
|
పాలగుమ్మి
|
ఓలేటి వెంకటేశ్వర్లు
|
శ్రీ దాశరథి
|
శ్రీ దాశరథి , శ్రీ పాలగుమ్మి పద్మరాజు
|
శ్రీ దండమూడి మహీధర్
|
శ్రీ ఏడిద గోపాల రావు
|
శ్రీ మల్లాది సూరిబాబు
|
శ్రీ ఇలియాస్ అహ్మద్
|
శ్రీమతి జ్యోత్స్న
|
శ్రీమతి మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి
|
డాక్టర్ కె.బి.గోపాలం
|
శ్రీ సంధ్యావందనం శ్రీనివాస రావు
|
శ్రీ సుధామ
|
శ్రీమతి ఉషారాణి
|
శ్రీ కందుకూరి సూర్యనారాయణ
|
ఎం.జి.శ్యామలా దేవి
|
శ్రీమతి శారదా శ్రీనివాసన్
|
శ్రీ.కొత్తపల్లి సుబ్రహ్మణ్యం
|
శ్రీ డి.వెంకట్రామయ్య
|
శ్రీ.దుగ్గిరాల పూర్ణయ్య
|
శ్రీ జి.జె.రవివర్మ
|
శ్రీ మల్లంపల్లి ఉమామహేశ్వరరావు
|
శ్రీ.పన్యాల రంగనాధరావు
|
శ్రీ ఎస్.బి.శ్రీరామ మూర్తి
|
శ్రీ పాలగుమ్మి విశ్వనాథం
|
రంగనాయకమ్మ గారి "స్వీట్ హోం" రేడియో నాటకంలోని కళాకారులు
|
|
శ్రీ నండూరి సుబ్బారావు గారు ఆకాశవాణి అభిమానుల మనసుల్లో చాలా బలమైన ముద్ర వేసిన ధన్యజీవి. ఆయన స్వయంగా పాల్గొన్న, నటించిన కార్యక్రమాలు, ఆయన ఆధ్వర్యంలో ప్రసారమైన ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ఆకాశవాణి చరిత్రలో సువర్ణకలశాలు.
వారి అబ్బాయి శ్రీ నండూరి శశిమోహన్ గారు తన తండ్రి గారి "పర్సనల్ ఆల్బం" లో ఉన్న అరుదైన, అపురూపమైన "చిత్ర" భాండాగారాన్ని మీ అందరితో పంచుకోమని నాకు అందించినందుకు వేల కృతజ్ఞతలతో.
ఈ భాండాగారాన్ని అందించటంలో సాయపడ్డ శ్రీ నండూరి వారి కుమారులు శ్రీ నండూరి ప్రభాకర్ గారికి, శ్రీ నండూరి శశిమోహన్ గారి అమ్మాయి తుర్లపాటి స్వాతి గారికి కూడా సహస్ర ధన్యవాదాలతో.
భవదీయుడు
మాగంటి వంశీ
|
ఆకాశవాణి అభిమానులకు అపురూప కానుక ఈ చిత్రరాజాలు . వివిధ పత్రికలనుండి ఏనాడో నేను సేకరించిన వాటిలోనుండి కొన్ని ఇక్కడ మీకోసం
భవదీయుడు
మాగంటి వంశీ
|
|