" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో "
చిత్ర సేకరణ: మాగంటి వంశీ మోహన్ Picture Source: Andhra Prabha Daily Date: Not known |
ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు శ్రీమాడపాటి హనుమంత రావుగారి పేరు విననివారుండరు. ఆయన మనవరాలు సత్యవతిగారు ఆకాశవాణి వార్తా విభాగంలో న్యూస్ చదివి, అందరికీ అర్థమయ్యే సులభశైలిలో కమ్మని కంఠంతో వినిపించేవారు. ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన ఒకానొక ఇంటర్వ్యూలో ఆవిడ ఇలా అంటారు "కోఠీ ఉమెన్స్ కాలేజ్‌లో బి.ఎ, ఉస్మాని యాలో ఎం.ఎ. చేశాను. ఆ రోజుల్లో డెక్కన్ రేడియో అని ఉండేది. ఆ తర్వాత ఎ.ఐ.ఆర్. ఆకాశవాణిగా మారింది. నాతో పాటే వి.ఎస్. రమాదేవిగారు కూడా ఎనౌన్సర్‌గా చేరి మానేశారు. నేను న్యూస్ రీడర్‌గా సెలక్టు అయి 1989లో రిటైరయ్యాను. అప్పుడు తురుగా కృష్ణమోహన్ గారు న్యూస్ రిపోర్టర్‌గా ఉండేవారు. నేను న్యూస్ రీడర్, ఎడిటర్‌గా చేశాను. శ్రీ ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రి అయినపుడు, ఆ న్యూస్ అంతా కవర్ చేశాను. శ్రీమతి ఇందిరాగాంధీ ఆగస్టులో మీటింగ్ పెట్టినపుడు చాలా దగ్గరగా ఆమెది రికార్డు చేయటం నాకు చెప్పలేని ఆనందానుభూతి కలిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా శ్రీమాడపాటి వారి మరణ వార్తను నేను న్యూస్‌గా చదవాల్సి రావటం విధివిలాసమే." |