" ప్రసార ప్రముఖులు - ఆల్ ఇండియా రేడియో "
2010 దీపావళి రోజున కానుకగా తనవద్దనున్న ఈ క్రింది అపురూప చిత్రం, సంబంధించిన వివరాలు అందించిన ఆకాశవాణి ప్రముఖులు, ప్రముఖ కార్టూనిస్టు, రచయిత, కవి శ్రీ సుధామ గారికి సహస్ర కృతజ్ఞతలతో


శ్రీ పాలగుమ్మి విశ్వనాథం. వీరి పేరు ఆకాశవాణి అభిమానుల్లో తెలియనివారు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. మ్యూజిక్ ప్రొడ్యూసర్గా వీరు అందించిన ఆణిముత్యాలు ఎన్నో ఎన్నెన్నో. పాలగుమ్మి పద్మరాజు గారు (మూడవ చిత్రం) వీరికి అన్నగారు