" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో "
చిత్ర సేకరణ: ఇంటర్నెట్ నుండి సోర్సు: తెలియదు తేదీ: తెలియదు |
శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు - వీరు ప్రముఖ సంగీత విద్వాంసులు. వీరు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనేక సంవత్సరాలు పని చేశారు. వీరు నిర్వహించిన సంగీత శిక్షణ పేరెన్నికగన్నది. వీరు పాడిన అనేక భక్తి గీతాలు "భక్తి రంజని" కార్యక్రమ శ్రోతలను అలరించాయి. ముఖ్యంగా వీరు పాడిన శ్రీ శంకరాచార్య విరచిత భజగోవిందం చాలా ప్రసిధ్ధం |