" ప్రసార ప్రముఖులు - ఆల్ ఇండియా రేడియో "

డాక్టర్ కె.బి.గోపాలం గారి గురించి డాక్టర్ అనంతపద్మనాభరావు గారు తన రచన "ప్రసార ప్రముఖులు" లో ఇలా వివరిస్తారు

"గోపాలాచార్యులు 1956 జూన్ 15న తెలంగాణాలో జన్మించారు. M.Sc పట్టభద్రులై, పి.హెచ్.డి పట్టా ఉస్మానియ విశ్వవిద్యాలయం నుండి పొందారు. ప్రయివేట్ కళాశాలల్లో కొంతకాలం సైన్సు లెక్చరర్ గా పనిచేశారు. 1986 జనవరిలో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో సైన్స్ ఆఫీసరుగా చేరారు. శాస్త్రీయ కార్యక్రమాల రూపకల్పనలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. హైదరాబాదులో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగా పనిచేశారు. 1993 జూన్ 15న స్టేషన్ డైరెక్టరుగా ఆదిలాబాద్ కేంద్రానికి బదలీ అయ్యారు. సైన్సు వింతలు - విశేషాలు తెలియజేస్తూ అనేక వ్యాసాలు వివిధ పత్రికలలో వ్రాశారు. అనేక గ్రంథాలు ప్రచురించారు. సులభంగా పాఠకులకు సైన్సు విశేషాలు తెలియచేయడం ఆయన ప్రత్యేకత"