" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

ఆకాశవాణి, విజయవాడ ఉద్యోగంలో ప్రవేశానికి ముందు 1950లలో తన స్వగ్రామం ఆరుగొలను స్కూలు పిల్లలతో స్వయంగా స్థాపించిన "బాలప్రకాశ్" సంస్థ ద్వారా తను రచించి, నిర్వహించిన "గ్రామసేవక్" నాటకం, జిల్లా స్థాయిలో ఉత్తమ నాటకంగా వచ్చినప్పుడు, అప్పటి చల్లపల్లి జమిందారు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ గారి ద్వారా కప్పు అందుకుంటున్న నండూరి సుబ్బారావు