" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడ్యూసర్స్ గా పనిచేసిన శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి, శ్రీ కందుకూరి రామభద్రరావు గార్ల పదవీ విరమణ సందర్భంగా అప్పటి నిలయ కళాకారులు

క్రింద కూర్చున్నవారు

శ్రీమతి ఎ.కమలకుమారి (నటి, ఎనౌన్సర్), కుమారి వి.బి.కనకదుర్గ (డ్రామా ఆర్టిస్ట్), కుమారి శ్రీరంగం గోపాలరత్నం (గాత్ర సంగీత విద్వాంసురాలు), శ్రీమతి ఎం.నాగరత్నమ్మ (డ్రామా ఆర్టిస్ట్) కుమారి వింజమూరి లక్ష్మి (గాత్ర సంగీత విద్వాంసురాలు) కుమారి బి.టి.పద్మిని (స్క్రిప్ట్ రైటర్)

కుర్చీలలో కూర్చున్నవారు

శ్రీ అన్నవరపు రామస్వామి (వయొలిన్ విద్వాంసులు), ఎడమవైపు రెండవ వ్యక్తి శ్రీ యెల్లా సోమన్న (మృదంగ విద్వాంసులు, ప్రముఖ మృదంగ విద్వాంసులు శ్రీ యెల్లా వెంకటేశ్వరరావు గారి బంధువులు) మూడవ వ్యక్తి శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు (మ్యూజిక్ ప్రొడ్యూసర్, హిందుస్థానీ, కర్నాటక సంగీత విద్వాంసులు), శ్రీ కందుకూరి రామభద్రరావు, శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి, శ్రీ జి.వి.కృష్ణారావు (తెలుగు విభాగం స్క్రిప్ట్ రైటర్), శ్రీ రాచకొండ నరసింహమూర్తి (హిందీ విభాగం ప్రొడ్యూసర్ - హిందీ పాఠం నిర్వాహకులు), శ్రీ ఎన్.సి.హెచ్.కృష్ణమాచార్యులు (వయొలిన్ విద్వాంసులు, శాస్త్రీయ సంగీతం, హరికథలలో దిట్ట)

కుర్చీల వెనుక ముందు వరసలో నిలబడినవారు

ఎడమవైపు నుండి - శ్రీ రామవరపు సుబ్బారావు (వీణ), మూడవ వ్యక్తి శ్రీ కుటుంబయ్య (తంబుర వాద్యకారులు, ప్రతిరోజూ సాయంత్రం ఆయన చదివే మార్కెట్ ధరల ద్వారా అందరికీ పరిచయం) నాలుగవ వ్యక్తి శ్రీ దండమూడి రామమోహనరావు (మృదంగం), ఐదవ వ్యక్తి శ్రీ బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి (గాత్రం), వారి ప్రక్కనే వ్యక్తి శ్రీ ఉషఃశ్రీ (స్క్రిప్ట్ రైటర్ మరియు కార్మికుల కార్యక్రమంలో ధర్మసందేహాలు ద్వారా అందరికీ పరిచయం), శ్రీ ఎం.వాసుదేవమూర్తి (నటులు, ఎనౌన్సర్), శ్రీ సి.రామమోహనరావు (డ్రామా ఆర్టిస్ట్), చివరలో ఇద్దరు - శ్రీ ఛార్లెస్ (తబలా విద్వాంసులు) , శ్రీ సీతారాం (తబలా విద్వాంసులు)

పై వరుసలో నుంచున్నవారు

శ్రీ అల్లం కోటేశ్వర రావు (గోటు వాద్యకారులు), శ్రీ నండూరి సుబ్బారావు (డ్రామా ఆర్టిస్ట్), శ్రీ దత్తాడ పాండురంగరాజు (వయొలిన్ విద్వాంసులు), శ్రీ సుందరంపల్లి సూర్యనారాయణమూర్తి (క్లారినెట్ వాద్యకారులు), శ్రీ ఎన్.సి.వి.జగన్నాధాచార్యులు (ప్రముఖ లలిత, శాస్త్రీయ సంగీత గాత్ర విద్వాంసులు), శ్రీ ఎ.లింగరాజు శర్మ (ఎనౌన్సర్, డ్రామా ఆర్టీస్ట్), శ్రీ ఎ.బి.ఆనంద్ (ఎనౌన్సర్, డ్రామా ఆర్టిస్ట్), తరువాతి ముగ్గురి పేర్లు తెలియదు