" ప్రసార ప్రముఖులు - ఆల్ ఇండియా రేడియో "
2010 దీపావళి రోజున కానుకగా తనవద్దనున్న ఈ క్రింది అపురూప చిత్రం, సంబంధించిన వివరాలు అందించిన ఆకాశవాణి ప్రముఖులు, ప్రముఖ కార్టూనిస్టు, రచయిత, కవి శ్రీ సుధామ గారికి సహస్ర కృతజ్ఞతలతో

శ్రీమతి శారదా శ్రీనివాసన్: జననం:1935 ఆగస్టు 18. రేడియో హీరోయిన్ అని పేరు ఆవిడకే.1959 లో హైదరాబాద్ ఆకాశవాణి లో డ్రామా ఆర్టిస్టు గా చేరారు.చలం గారి పురూరవ నాటకానికి ప్రాణం పోసింది తనే.బంగారు కలలు సినిమా కు వహీదా రెహమాన్ కు డబ్బింగ్ ఇచ్చారు . వేణుగాన విద్వాంసులు ఎన్.ఎస్.శ్రీనివాసన్ వారి భర్త. రేడియోలోసంగీత విభాగం ప్రొడ్యూసర్ గా పనిచేసారు