" ప్రసార ప్రముఖులు - ఆల్ ఇండియా రేడియో "
|
సంగీత కళానిధి శ్రీ సంధ్యావందనం శ్రీనివాస రావు గారు 1921 ఆగష్టు 18 న అనంతపురంలోని పెనుకొండలో శ్రీమతి గంగాబాయి, శ్రీ నారాయణరావు గార్లకు జన్మించారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఉద్దండ పండితులు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర తొలినాళ్ళలో పనిచేసారు. అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా పనిచేసారు. మదరాసు సంగీత కళాశాల ప్రిన్సిపాలుగా చేసి 1994 జనవరి 25వ తారీకున స్వర్గస్తులయ్యారు. కానీ ఆయన వదిలి వెళ్లిన ఎన్నో భక్తిరంజని కార్యక్రమాలు ఈనాటికీ ప్రజల్ని అలరిస్తూనే ఉన్నాయి. |