ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. తెలుగువారికే ప్రత్యేకమయిన అవధాన ప్రక్రియకు దాదాపు 50 దాకా అనుకూలాంశాలు ఉన్నాయి. అందులో సమస్యాపూరణ ఒకటి. సమస్యాపూరణకు ఏదో ఒక అంశంపై పృచ్ఛకుడు అవధానికి నాలుగో పాదాన్ని ఇస్తాడు. దాని ఆధారంగా పై మూడు పాదాలను, అవధాని పూరించాలి. ఈ శతాబ్దపు మొదటి భాగంలోని మన కవుల, అవధానుల అసాధారణ నైపుణ్యానికి కొలబద్దగా నిలిచిన అలాటి అద్భుతమయిన సమస్యలను, అంతకన్నా అద్భుతమయిన ఆ సమస్యల పూరణలను కొన్నిటిని ఈ క్రింద చూడవచ్చు. తమకు తెలిసిన ఇతర విశేషాలు పంచుకోవాలనుకున్న మహానుభావులకి ఎల్లవేళలా ఆహ్వానం.ప్రస్తుతానికి కొన్నే ఉన్నా మరిన్ని మీ ముందుకు త్వరలో .. ఈ సమస్యలు పూరించిన అసాధారణ మేధావుల వివరాలు తెలిసినంతలో ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మీలో ఎవరికయినా తెలిస్తే ఆ వివరాలతో ఒక వేగు పంపండి. జతపరుస్తాను ..

సమస్యాపూరణ కోసం బొమ్మ మీద నొక్కండి

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
avadhAnam , samasyA pUraNa, telugulO avadhAnAlu, tirupati vEnkaTa kavulu, avadhAnamulu, samasyApUraNa, ashTAvadhAnam, SatAvadhAnam, sahasrAvadhAnam, Sata avadhAnam, ashTa avadhAnamu, ashtaavadhaanamu, avadhAnamu, avadhaanamu, avadhaanamulu
ఉత్తరమున భానుబింబ ముదయం బయ్యెన్

విపరీతపుఁబులుసుకూర విస్తరి మ్రింగెన్

దీపముశిఖమీఁద నీఁగ స్థిరముగ నిలిచెన్

అశ్వినికి వెన్కలో నుండునది యొసంగె

పులినిఁ బడె గుండు పందియు నెలుఁగు నీల్గె

కప్పకు సంపంగినూనె కావలె వింటే

ఏకాదశినాఁడు సప్త మేడేగడియల్

పాతరలో సూర్యుఁడుదయపర్వతమెక్కెన్

బోడికిఁ గొప్పుంచ మిగుల ముద్దులు గులికెన్

మీసానకుఁ గాళ్లు మూఁడు మేదినిఁ గల్గెన్

రంగపతే తురక గాక రంగప తౌనా

కుందేటికిఁ గొమ్ములాఱు కుక్కకువలెనే

పలుకులు గూబలకు మిగుల పండుగసేసెన్

అక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్

చుక్కలలో నొక్కనక్క సుడివడితిరిగెన్

కప్పం గని శేషుఁ డంత గడగడ వణఁకెన్

భక్షించెను జోడుమెట్లు పాపంబొట్లూ!

తలకాయలపులుసు తాగి తసిసిరి బాపల్

కుంచములో పోతునక్క కూనలు పెట్టెన్

రాధేయుఁడు నందినెక్కి రావణుఁ గూల్చెన్

బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్‌

కుక్కవో! నక్కవో! పులివో! కోతివో! పిల్లివో! భూతపిల్లివో!

పచ్చిమాంసంబు దినువాడు బ్రాహ్మణుండు

రాతిరి, సూర్యుడు నంబరమున దోచెన్‌

మానవతీలలామ కభిమానమె చాలును జీర యేటికిన్

భార్యాం నమతి సోదరః

మృగీ మునిం పుత్ర మసూత సద్యః

చంద్రోదయం వాంఛతి చక్రవాకీ

కువిందరాజం మనసా స్మ రామి

వ్యాఘ్రో మృగం వీక్ష్య హి కాందిశీకః

వర్షోదయం వాంఛతి రాజహంసీ

చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుఁడన్నయున్

భల్లూకముకడుపులోన భానుఁడు గ్రుంకెన్

రంకులు తేఁబోయి యేడురాత్రి ళ్ళాయెన్

గుత్తపుతాపితారవికకుట్టు పటుక్కునవీడె నింతికిన్

సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్

సొరచెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్

విధవాగమనంబు మిగుల వేడుక సేసెన్

ఎలుకలు తమకలుగులోని కేనుఁగుఁ దీసెన్

చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్

నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

తరువాతి పేజీ