చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుఁడన్నయున్
అవధాని - ???
చ. అలర గణింపఁ బంక్తిరథునాత్మజులెవ్వరు? మైథిలిండు నే
లలనకుఁదండ్రి? మన్మథునిలావుశరంబులునేవి? కాళికా
చెలువునినామమెద్ది? మఱి సీరికి శౌరియు నేమి కావలెన్?
చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుఁడన్నయున్

www.maganti.org