ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. తెలుగువారికే ప్రత్యేకమయిన అవధాన ప్రక్రియకు దాదాపు 50 దాకా అనుకూలాంశాలు ఉన్నాయి. అందులో సమస్యాపూరణ ఒకటి. సమస్యాపూరణకు ఏదో ఒక అంశంపై పృచ్ఛకుడు అవధానికి నాలుగో పాదాన్ని ఇస్తాడు. దాని ఆధారంగా పై మూడు పాదాలను, అవధాని పూరించాలి. ఈ శతాబ్దపు మొదటి భాగంలోని మన కవుల, అవధానుల అసాధారణ నైపుణ్యానికి కొలబద్దగా నిలిచిన అలాటి అద్భుతమయిన సమస్యలను, అంతకన్నా అద్భుతమయిన ఆ సమస్యల పూరణలను కొన్నిటిని ఈ క్రింద చూడవచ్చు. తమకు తెలిసిన ఇతర విశేషాలు పంచుకోవాలనుకున్న మహానుభావులకి ఎల్లవేళలా ఆహ్వానం.ప్రస్తుతానికి కొన్నే ఉన్నా మరిన్ని మీ ముందుకు త్వరలో .. ఈ సమస్యలు పూరించిన అసాధారణ మేధావుల వివరాలు తెలిసినంతలో ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మీలో ఎవరికయినా తెలిస్తే ఆ వివరాలతో ఒక వేగు పంపండి. జతపరుస్తాను ..

ప్రత్యేక గమనిక - ఈ క్రింది సమస్యలు - వాటి పూరణలు 1937వ సంవత్సరంలో ఆంధ్ర సాహిత్యపరిషత్ వారిచే ముద్రింపబడిన శ్రీ రాయరఘునాథ తొండమాన్ మహీపాల విరచిత "కవిజనోజ్జీవని - సమస్యలు" అనే పుస్తకం నుండి తీసుకొనడమయినది. ఈ పుస్తకాన్ని నాకు అందించిన సహృదయులు డాక్టర్ జెజ్జాల కృష్ణమోహనరావుగారికి కృతజ్ఞతాభివందనాలతో.ముఖ్య గమనిక - వీటిలో చాలా సమస్యలు పుదుక్కోట మహరాజు అయినటువంటి రఘునాథ తొండమాన్ భూపాలుడి ఆస్థానంలోని విద్వత్కవి, అపరసరస్వతీపుత్రుడు అయిన శ్రీ నుదురుపాటి వేంకనార్యుడు ఇచ్చుచుండగా, స్వయంగా రఘునాథభూపాలుడే పూరించినట్లు ఆ పుస్తకంలో పేర్కొనబడింది.

సమస్యాపూరణ కోసం బొమ్మ మీద నొక్కండి

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

కలుషగిరిభేదశంబ శ్రీబృహదంబా

క్రకచము జలధరమువోలెఁ గడు నింపెసఁగెన్

కావేరే శిరముపైని గట్టఁగవలయున్(శబ్దవిచిత్ర)

కావేరే శిరముపైని గట్టఁగవలయున్

వాతెఱ లే కొక్కవనిత వర్షం బుండెన్

వావిలి లోఁద్రోయఁ గ్రోఁతివలెనే యుండెన్

పాగా గొంతుకడ శిరముపైనిం గలదే

కంబాలకుఁ జనులు గిరులకైవడి వెలసెన్

పడుచున్నను బెండ్లిసేయువారును గలరే

ముక్కున నలమానవుండు భూరి యొసంగెన్

వంకాయాపెసరకాయె వడ్లాజొన్నల్

నీవేచేసితిని గాక నేచేసితివే

భంగి నీళ్లను ద్రాగినఁ బ్రజ్ఞచెడదు

చండాళులఁ జేరు తమ్మి సరి యనఁ దగునే

పోఁగులు చెవులకడలేక భుజమున వెలసెన్

మారు జగడాన నారదమౌని బలిసె

కుంపటిలో నక్క కుక్కకూనల నీనెన్

చేఁపచన్నులలోఁ బాలు చెంబెఁ డుండె

ఖానుడు వేంచేసి రాఁగఁ గంటివె చెలియా

కలికిని గనుఁగొంటి డేగకాల న్మింటన్

బోటికి నెందైన వస్త్రముంతురె చెలియా

ఈఁగయుఁ బులి సమముగానె యేర్పడి యుండెన్

వంకాయను జెఱుకురసము వడియుచునుండెన్

రథమునును బండి తినుట చిత్రంబుగాదె

కరపదవదనముల నొక్కకట్టియ దూసెన్

కందులకును నెఱ్ఱమట్టి కావలయునె కా

నలుగురిమట్టునను నిలిచె నాయిల్లాలే

కిన్నెర నటువెట్టి బాల కిలకిలనవ్వెన్

అయ్యయ్యో ప్రౌఢ ముగ్ధయై విలసిల్లెన్

అల్లె ఖేటకమును గూడ నైనఫలము

అన్నను సవతి యని పోరునట్లే యయ్యెన్

ఇనతనయునిఁ జూచి రాముఁడిట్లని పలికెన్

వజ్రము వెన్పక్కఁ గెంపువలెఁ గన్పించెన్

విధ్యండము లీక్షరీతి విశ్రుతమయ్యెన్

గోగ్రణిగోఅగ్రణీగవాగ్రణియనియెన్

బాహ్లికహయమెక్కి రాజు పౌఁజుకువెడలెన్

కల్హారమందమట్లు కల్కికిఁ బల్కుల్

చందురులోఁ గందు మిగుల సమ్మదవృత్తిన్

కలికీ ననుఁజూచి విడెము గైకొను మింకన్

బావిని బట్నములు దానిపైకడఁ గొండల్

ముక్కులు నాలుకలు మూఁడు పొలఁతికిఁ గంటిన్

విధవా నీమగఁడు నిండువేకటి గదవే

పాలు త్రావకయుండియు బలిమికలిగె

కొల్లడమున నొక్కచేఁప కొంగను మ్రింగెన్
             ముందు పేజీ