భంగి నీళ్లను ద్రాగినఁ బ్రజ్ఞచెడదు
గీ. భంగినీళ్లను ద్రాగిన బ్రజ్ఞచెడక
పోవదెటువంటి వారికి భూమిలోన
లలన యేమందుఁ జిత్ర మాకలశమునికి
భంగి నీళ్లను ద్రాగినఁ బ్రజ్ఞచెడదు

భంగము = అల, భంగములుగలది=భంగి=సముద్రము,
భంగి=గంజాయి, కలశముని=అగస్త్యుడు,
భంగినీళ్లు=సముద్రోదకము


www.maganti.org