ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.
తనవద్దనున్న ఆడియోల భాండాగారం నుంచి అపురూపమైన ఈ క్రింది ఆడియోలు అందించిన ప్రియ మిత్రులు శ్రీ కారంచేడు గోపాలం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశం లేదనీ, లాభాపేక్ష / ధనార్జన ఉద్దేశమంతకన్నా లేదనీ సవినయంగా తెలియచేసుకుంటూ - అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద కూడా ఇలాటి అరుదైన ఆడియోలు, రికార్డింగులు ఉంటే వాటిని అందించి సహకరించ ప్రార్ధన.
తన తండ్రిగారైన శ్రీ బి.ఎన్.మూర్తిగారు 70వ దశకంలో టేపుల మీద రికార్డు చేసుకున్న అపురూపమైన ఈ ఆడియోలు ఎం.పి.3 లుగా మార్చి ఇక్కడ మీతో పంచుకోడానికి అవకాశమిచ్చిన మిత్రులు బుర్రా రాంచంద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో. రాంచంద్ గారి తల్లిగారు శ్రీమతి సరోజినీ దేవి గారి మంగళహారతులు (వయోలిన్, స్వరం) ముఖాముఖి సెక్షన్లో చూడవచ్చు.