అందముగ నీ కథ వినవే రజ, తాచలనదనా, పరిహసిత వి
ఆధ్యాత్మ రామాయణం (బాలకాండ)
ఆధ్యాత్మరామాయణ కీర్తనల బ్లాగు నిర్వహించే శ్రీ మల్లిన నరసింహారావు గారు ఈ పై కీర్తన పూర్తి పాఠాన్ని అందించారు. అందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఎక్కడైనా తప్పులు కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపం

అందముగ నీ కథ వినవే రజ, తాచలనదనా, పరిహసిత వి
(ఆధ్యాత్మ రామాయణ కీర్తన - మునిపల్లి సుబ్రహ్మణ్య కవి)

కన్నడ -- ఆదితాళము

పల్లవి
అందముగ నీ కథ వినవే రజ, తాచలనదనా, పరిహసిత వి
నిందితారవింద చంద్రవదనా, కుందబృందసుందర రదనా IIఅందII

అనుపల్లవి
మందయాన దశరథవధేశుడు, మాన్యయశుఁ డయోధ్యా, కాంతుడు
పొందుగ దనయులు లేనందుకు వగఁ జెంది వసిష్ఠుని జేరి పల్కె సా IIనందII

మనవి వినుము స్వామీ నా కిక శ్రీ, మంతులైన సుతులు, ఏ వెర
వున జనియించెద రాత్మదహీనునకు ధ,నంబు సుఖరంబు గాదు గదా
అనిన రాజు కనియె నా వసిష్ఠుడు, జననాయక నీకు కొడుకులు
ఘను లమల యశోధనులు నల్వురిక గల్గెద రందు కుపాయము గలదనె IIనందII

శాంతుడైన ఋష్యశృంగ మౌనీ, శ్వరుని బిలువనంపు మీవు
పుత్రకామేష్టి నిరంతర, సంతోషస్వాంతుడవై యొనరింపు
మంతయు ద్వరగా ననుడును శాంతా, కాంతుని రావించి రిపుదు
ర్దాంతుడు ముని పరివృతుడై సరయువు, చెంత యజ్ఞదీక్షకొని నిలిచె IIనందII

వేదమంత్రములు బలుకుచు శుచియై వేల్వగ హుతవహుడు హవ్యము
సాదరమున గై కొని తగం బ్రదక్షిణార్చు లలర జ్వలియించెను వసుప్రభుడై
ఖేదహరుడు యజ్ఞేశుడు దశరథ, మేదినీశ్వరునకు, శుభశం
పాదకమగు పాయస పాత్ర మొసగి, పరమాత్ముడు సుతుడగు నీ కని చనే IIనందII

లల నలరిరి- మౌనులు లబ్ధమనో, రధుడై దశరథుడు, ముదమున
జెలగుచు ఋష్యశృంగ వసిష్ఠుల చే ననుజ్ఞ గొని హవిస్సు వేడుకను
కలిత గుణుడు కౌసల్యకు సగమును, కైకకు సగ మొసగ, వారలు
దెలిసి సుమిత్రకు దమ యంశంములం, దెలమి సగము సగమొసగిరి విరతా IIనందII

పరమాన్నము భుజించిన మువ్వురు, తరుణులు గర్భిణులై, వెలిగిరి
నిరతము సురకాంతలుగ దొమ్మిది నెలలునిండ కౌసల్య గనెను సుతుని
పరగ జైత్ర శుద్ధ నవమిని పునర్వసు నక్షత్రమున, సుమనో
హర కర్కాటక లగ్నమునను శేషాచలేశుడగు హరి జనియించినా IIనందII