రాముని సకల గుణాభి రాముని నిఖిల రాక్షస వి రాముని వర్ణింప వశమా ఆధ్యాత్మ రామాయణం (బాలకాండ) |
ఆధ్యాత్మరామాయణ కీర్తనల బ్లాగు నిర్వహించే శ్రీ మల్లిన నరసింహారావు గారు ఈ పై కీర్తన పూర్తి పాఠాన్ని అందించారు. అందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఎక్కడైనా తప్పులు కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపం రాముని సకల గుణాభి రాముని నిఖిల రాక్షస వి రాముని వర్ణింప వశమా (ఆధ్యాత్మ రామాయణ కీర్తన - మునిపల్లి సుబ్రహ్మణ్య కవి) ముఖారి - ఆదితాళము పల్లవి రాముని సకల గుణాభి రాముని నిఖిల రాక్షస వి రాముని వర్ణింప వశమా IIరామునిII అనుపల్లవి వేమాఱు కౌసల్య నీ వే మేమి గోరినా వది యెల్ల శ్రీ మీఱ నొసగితి ననుచు ప్రేమచే జననితో బలికిన IIరామునిII మున్ను బ్రహ్మ నన్ను వేడు కొన్న భూభారము దీర్ప వన్నె మీరగను నేడు, నీ గర్భమున జెన్నలర బుట్టితి చూడు, రావణాసురు డన్నిట గర్వించినాడు, వాని వధియించి సన్నుతి గాంచు నీ రేడు, జగములలోన మున్నలర దశరథుడు నీవు నన్ను దపమున మెప్పించి కన్నారు నీ వదితి వతడు, కశ్యపుడని కౌసల్యకు దెలిపిన IIరామునిII 1 అనుచు దల్లితో బలికి, హరి ముద్దుబాలుడై కలికి తనమున హరి నీలగాత్రుడై, వికసిత నవ్య వనజదళ విశాల నేత్రుడై, చక్కని వా డనుచు నుతియింప పాత్రుడై, అమల ప్రకాశ మునకు జూడ దరుణ మిత్రుడై, విలసిల్లె నంత ఘనుడైన తనయుడు గల్గె నని విని దశరథు డానంద మునను గురునితోడ గూడీ, చనుదెంచి కన్గొనెను శ్రీ రఘు IIరామునిII 2 విరులవాన లపుడు గురిసె, వేడ్క జయదుందుభులు మొరసె సురసుందరు లెలమి నాడిరి, గంధర్వ వరులు సరసులై రాగములు బాడిరి, మౌనులు దోషా చరుల వలని భయము వీడిరి, పౌరులానంద కరుని జూడ గుమిగూడిరి దశదిశల యందు పరిమళ మిలితములైన తెమ్మెరలు విసరె దివిని సురలు వర విమానారూఢులై శ్రీ, హరి హరీ యని మ్రొక్కిరాత్మాIIరామునిII 3 ఘనవిభుడైన కొమరుని, గనెను కైక చంద్రబింబా ననులను సుమిత్ర గనెను, సుతుల నిర్వురను మొనసిన సంతోషమునను దశరథుడు సకల ధనముల విప్రుల దనిపెను, వసిష్ఠ మహా ముని యా బాలురకు క్రమమునను రామ భరత ల క్ష్మణ శత్రుఘ్నులనుచు నామ, కరణము లొనరించెను భరతుండును శత్రుఘ్నుడు జోడై, లక్ష్మ ణుడు ననుసరించెను దశరథ IIరామునిII 4 చెలగి సౌమిత్రు తో గూడి మెలగుచుం దేనియ లొలుక బలుకు సుతుని నృపుడు గాంచి, భూషణ జాల ముల తోడ నలంకరించి శిస్తు గస్తూరి తిలకము నుదుట నుంచి గళమున రత్న కలిత హారములు గీలించి, ముద్దాడు నపుడు కల కల నవ్వుచు మద్ది, కాయ లల్లాడ నందియలు ఘల్లు ఘల్లు మనుచు మ్రోయ లలిత గతుల నటియించు శ్రీ IIరామునిII 5 చిన్నారి బొజ్జలో నన్ను గన్నవాడా నా పాలిటి పెన్నిధానము రారా, యోరి నా చిన్ని యన్న బూచి వచ్చేరారా, పరుగెత్త వల దన్న నాతో నలుగ మేరా, పాటపాడుచు నిన్ను లాలి యూచే రారా లాల బోసేను మన్ను చేత నంటవద్దు వెన్న బెట్టే ననుచు చాలా మన్నించి పలుకు కౌసల్యకు, మరులు రెట్టింప జేయు IIశ్రీరామునిII 6 ధరణి విభుడు, భుజియించు, తఱిని కౌసల్య తనయుని మురిపెమున రమ్మని జీర, పరమయోగి హృదయాం తరమునందు జెల్వు మీర, వసియించు దేవుడు చిరుత వాడయి ముద్దు గార, వచ్చిన జూచి తరుణి తనదు కోర్కెలు మీర, కౌగిటనుంచి కరుణించి భుజియించు మనిన, కబళము చేనందుకొని తిరుగా నాటలాడు పరుగెత్తిన మాయా బాలకుడౌ శ్రీ IIరామునిII 7 వితత యశుడు దశరథ భూ, విభు డంతట కౌమారాన్వితుల సుతుల దిలకించి, యుపనయనములు పతులముగ నొనరించి, వశిష్ఠు నొద్ద శృతుల నెల్ల చదివించి, చతురంగముల గతుల దెలియ నేర్పరించి, చౌ షష్ఠి విద్య చతురులను గావించి, హర్షించ వారు సతతము గురు బంధుమిత్ర, జనులకెల్ల హితులై ధైర్యోన్నతులై పరగిరందులో శ్రీ, యుతుడయి సత్యవ్రతుడైన శ్రీ IIరామునిII 8 తల్లి దండ్రులకు ప్రియము, దనరగ నశ్వము నెక్కి విల్లునమ్ములు చేపట్టి, వేటలాడుచు మొల్లమున నడవినున్నట్టి, మృగముల గుండెలు ఝల్లు ఝల్లున జుట్టి ముట్టి , పోనీక వాని నెల్ల చలపట్టి పడగొట్టి సౌమిత్రి గూడి బల్లిదుడై యన్ని యయోథ్యా వల్లభునకు కాన్క జేసి సల్లలితుడై సకల జనుల, సవినయముగ బాలించు శ్రీIIరామునిII 9 శైల రాజ కన్యకా యీ, చందమున మనుజావతార లీలమై వర్తించెడు శౌరి, గనుగొను మింద్ర జాలికుడు చక్రధారి, సమస్త వేద మూలమై విలసిల్లు దారి, యజ్ఞులు దెలియ జాల రతడు నిర్వికారి, విమత సంహారి శ్రీలచే జెలువందు శేష, శైలశిఖరాగ్ర విహరణ శీలుడై సద్భక్తలోక, పాలుడై దనరు నిత్యాత్మా IIరామునిII 10 |