అరుదైన ఈ పాటల రికార్డింగు గురించి కారంచేడు గోపాలం గారి మాటల్లో This Adhyatma Ramayanam is a musical rendition of Munipalle Subrahmanya Kavi's work.The entire set of songs was produced by AIR with many leading artists.They are ever enjoyable!! శ్రీరాముని గాంచెను ఆధ్యాత్మ రామాయణ కీర్తన (బాలకాండ) |
ఆధ్యాత్మరామాయణ కీర్తనల బ్లాగు నిర్వహించే శ్రీ మల్లిన నరసింహారావు గారు ఈ పై కీర్తన పూర్తి పాఠాన్ని అందించారు. అందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఎక్కడైనా తప్పులు కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపం శ్రీరాముని గాంచెను (ఆధ్యాత్మ రామాయణ కీర్తన - మునిపల్లి సుబ్రహ్మణ్య కవి) శంకరాభరణము -- ఆట తాళము పల్లవి శ్రీరాముని గాంచెను పార్వతీ వినవే మన కౌసల్య యా త్మా రాముని గాంచెను IIశ్రీరామునిII అను పల్లవి తోరమై హర్షాశ్రు పూరమై కన్నుల జార భయ సంభ్ర మా శ్చర్యము ల్బెనగొనగా IIశ్రీరామునిII అలనల్ల కలువ ఱే కుల చాయ మేనితో జెలగువాని పసిడి చేల గట్టినవాని వెలయు నాల్గు భు జములవాని కనుగొ ల్కుల నరుణ రేఖలు కలవాని స్వర్ణకుం డల లసిత గండమం డలములవాని య స్ఖలిత రవికోటి ప్రకాశుని రత్నో జ్వల కిరీటమువాని నళినూల కుటిల కుం తలములచే ముద్దు గులుకు చుండెడివాని IIశ్రీరామునిII 1 ఘనతర శంఖ చక్ర గదాబ్జములవాని వనమాలికా యరుత దనరు వాని చిరున వ్వను వెన్నెలలా నవచంద్రుడు దిక్కు లను వెదచల్ల జెల్వ ల రారెడు వాని యనుమాన కరుణామృత పూర్ణ నే త్రుని మంజీరాంగదుని శ్రీవత్సకటకం కణహార కేయూర కౌస్తుభాది భూ షణ భూషితుని జూచి తనివి తీరక తిరుగ IIశ్రీరామునిII 2 శరణా గతులను కరుణ రక్షించు శ్రీ ధర నీకు బహు వందనము లొనర్చెద శరణు గర్విత దనుజ చయ విరామరామ శరణు దేవతా సార్వభౌమ నీవే పరమాత్ముడవు జగత్పతి వీశుడవు హరివి పరయోగి బృంద ద్వనజ కర్ణికాం తరమున సురుచిర రాకాజ్యోతివై మెఱయు నిన్నెన్న నాతరముగాదని తిరుగIIశ్రీరామునిII 3 ఈశ నీవు నిఖిలేంద్రియ సాక్షివి శ్రీశుడి వీ విశ్వ సృష్టి సంరక్షణ నాశము లొకటను జేసి సేయకున్న వాశిచే బోయి పోవని వాడవై ప్రకృతి డాసి డాయనివాడ వై శాశ్వతుడ వై యా కాశాది భూత సంఘములకెల్ల నవ కాశమై నీవు ప్రకాశింతు విది మాయా పాశాది బద్ధుల కెఱుగ వశముగాదని తిరుగ IIశ్రీరామునిII 4 నీ జఠరము నందనేక బ్రహ్మాండము లీ యోజ బరమాణువులై యున్నవిపుడు నీవు రంజిల్లు నా యుదరమున బుట్టుట కల్ప భూజము ముంగిట మొలచినట్లయ్యె నం భోజాక్ష పతి ధన పుత్రాది సక్తనై నే జెల్ల సంసార నీరధి బడనొల్ల శ్రీజాని నీ శరణు జెందితి నామదిని దేజరిల్లుచును సుస్థిరుడవు గమ్మని IIశ్రీరామునిII 5 ఈ యఖిలమును మోహింప జేయు నీదు మాయకు నగుపట జేయకు నను శేష శాయి యీ రూప ముపసంహరింప గదోయి కాయజ జనక చక్కని ముద్దుపట్టివై నన్నలర జేయు మమితా నంద దాయివని నిను మదిని దలతురు ఘనులెల్ల మాయురే యనుచు వే మారును వినుతించి శ్రీయుత మూర్తి యా శేషాచలేశుడౌ IIశ్రీరామునిII 6 |