ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.
ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడెమీ వెబ్సైటులో అందుబాటులో ఉన్న, ప్రచురించబడ్డ పత్రికలలోని కొన్ని అరుదైన వ్యాసాలు, నాటికలు, కథానికలు మరియు ఇతర రచనలు, నాకు నచ్చినవి ఇక్కడ ప్రచురించడానికి సాహసిస్తున్నాను. ఈ రచనలను / ఫైళ్ళను ఇక్కడ ఉంచటంలో ఉద్దేశం, మరింత ఎక్కువమందికి అందుబాటులోకి తేవటమే కాని, మరే ఇతర ఉద్దేశమూ లేదు.
ఈ రచనలకు కాపీ రైట్ హక్కులు ఉన్నవారు ఎవరైనా అభ్యంతరం తెలియచేస్తే, క్షమాపణలతో వెనువెంటనే తొలగించబడతాయి.
- ఆంధ్ర పత్రిక 1947వ సంవత్సరంలో శ్రీ వారణాసి శ్రీనివాసరావు గారు వ్రాసిన "గొప్పవారితో గుసగుసలు" అనే రచనలతో ఒక సీరీస్ ప్రారంభించి, ఆ గుసగుసలన్నీ ప్రకటించింది.
పూర్వమహాపురుషుల చరిత్రాంశాలను సేకరించుకొని, ఆయా సంఘటనలను, అవస్థలకు తగిన మానసిక స్థితులను ఊహించి, వారిని యధార్ధ పురుషులుగా మనలో వారిగా, మనతో సంభాషిస్తూ తమ నిజ చరిత్రను చెప్పుకొంటూన్నవారిగా, ఈ గుసగుసలలో చక్కగా చిత్రించారు. శ్రీ శ్రీనివాసరావు గారు బందరు హిందూ కళాశాల మొదటి ప్రిన్సిపాలుగా పేరెన్నికగన్నవారు.ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యాలలో అసాధారణమైన ప్రజ్ఞ కలవారు.
వారు వ్రాసిన ఆ గుసగుసలు ఇక్కడ ప్రచురించటానికి సాహసిస్తున్నాను. కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశమేమాత్రం లేదని తెలియవేసుకుంటూ, ఈ రచనలు మరింతమందికి చేరువకావాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఉంచటం జరిగిందనీ, కాపీరైటు హక్కుదారులు వీటిని తీసివెయ్యమని కోరిన వెంటనే క్షమాపణలతో ఇక్కడినుంచి తొలగించబడతాయని తెలియచేసుకుంటూ
- 1935, 36 వ సంవత్సరాలలో శ్రీ జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి గారు రాసిన కొన్ని కథలు, నాటికలు ఇక్కడ చూడవచ్చును కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశమేమాత్రం లేదని తెలియవేసుకుంటూ, ఈ రచనలు మరింతమందికి చేరువకావాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఉంచటం జరిగిందనీ, కాపీరైటు హక్కుదారులు వీటిని తీసివెయ్యమని కోరిన వెంటనే క్షమాపణలతో ఇక్కడినుంచి తొలగించబడతాయని తెలియచేసుకుంటూ