ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. తెలుగుదేశాన జన్మించిన మాణిక్యాల్లాంటి వ్యక్తులు, వారి చిత్రాలతో కూడిన వివరాలు మరెన్నో మీ ముందుకు తీసుకుని రావాలి అన్న చిన్ని ప్రయత్నమిది. మన వారసత్వ, చారిత్రక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ సహకరించ ప్రార్ధన.

ఆంధ్రదేశం చాలా కాలం రాజాశ్రయాన మూడుపూవులు ఆరుకాయలుగా వర్ధిల్లింది. ఆంధ్ర సంస్థానాలు - సాహిత్యపోషణ అనే రచనలో ఆచార్య తూమాటి దొణప్పగారేమంటారంటే - "జమీందారీ వ్యవస్థ గర్హింపదగిందే అయినా, ఆయా జమీందారులు ఉన్నత సంప్రదాయాలను పోషిస్తూ - సాహిత్య సంస్కృతులకు పరిరక్షకులుగా చేసిన సేవ మాత్రం విస్మరింపరానిది." అలాటి సంస్థానాధీశుల వివరాలు, చిత్రాలను తెలియనివారికి పరిచయం చేయటం ఈ భాగం యొక్క ఉద్దేశం.

ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ చల్లా కృష్ణమూర్తి గారి కుమార్తె డాక్టర్ చల్లా విజయలక్ష్మిగారు తన పరిశోధక గ్రంథం "ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాజ్మయం" లో ఆయా సంస్థానాల సంగీతపోషణ గురించి విస్తృతంగా వివరిస్తారు. అడగగానే ఆ పుస్తకాన్ని ఇక్కడ ప్రచురించుకోడానికి అనుమతి ఇచ్చినందుకు వారికి సహస్ర కృతజ్ఞతలు. ఈ పుస్తకంపై సర్వ హక్కులు వారికే చెందుతాయనీ, ఎవరైనా వాడుకోదలిస్తే ముందుగా వారి అనుమతి తీసుకోవాలని తెలియచేసుకుంటున్నాను.

ఇటువంటి అరుదైన ఇతర సంస్థానాధీశుల వివరాలు, చిత్రాలు తమదగ్గర ఉన్నవారు, వాటిని దయచేసి మాకు పంపగలరు. ఆ ఫోటోలను కూడ మా వెబ్ సైటులో ఉంచగలము.

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
(July 2005)

చల్లపల్లి

అమరచింత

అమరావతి

ఆండ్ర

తిరుపాచూరు

మంత్రిప్రెగడ

గురజ

ఆత్మకూరు

మందస

విసన్నపేట

వల్లూరు

కపిలేశ్వరపురము

కార్వేటినగరము

కాళహస్తి

కురుపాము

కోలంక-వీరవరము

గద్వాల

గూటాల

గొడే

జటప్రోలు

తెట్టు

దోమకొండ

నరసరావుపేట

నూజివీడు

పాచిపెంట

పానుగల్లు

పాపన్నపేట

పాలకొండ

పాల్వంచ

పిఠాపురము

పుంగనూరు

పెద్దాపురము

పోలవరము

బనగానపల్లి

బొబ్బిలి

బోరవెల్లి

మాడుగుల

ముక్త్యాల

ముత్యాలపాటి

మునగాల

మేరంగి

రాచూరు-రేపల్లె

లక్కవరము

వనపర్తి

ఉర్లాము-దేవాది

విజయనగరము

వేంకటగిరి

సంగమవలస

సాలూరు

సురపురము

ఆనెగొంది

ఉండ్రాజవరము