" ఆంధ్ర దేశ సంస్థానాధీశులు "
చిత్ర సేకరణ: మాగంటి వంశీ మోహన్ |
చల్లపల్లి (దేవరకోట) సంస్థానం (కృష్ణా జిల్లా) 1918లో శ్రీ రాం వీరబ్రహ్మం గారిచేత రచింపబడిన "నానా రాజన్య చరిత్రము" పుస్తకంలోని, మరియు మా అమ్మగారి ఊరు / నేను పెరిగిన ఊరు అయిన చల్లపల్లి (దేవరకోట) సంస్థానం యొక్క వివరాలున్న పేజీలు పి.డి.ఎఫ్ పుస్తకంగా చేసాను. ఆ భాగం ఇక్కడ నొక్కి చూడవచ్చు. |
చల్లపల్లి రాజా శ్రీ శివరామప్రసాద్ బహద్దరు గారు చాలా కాలం కృష్ణాజిల్లా బోర్డు అధ్యక్షులు. మద్రాస్ శాసనసభ్యులు. ఆంధ్రమహాసభాధ్యక్షులు. చెళ్ళపిళ్ళ, శ్రీపాద, వేటూరి, కాశీకృష్ణాచార్యులు, ఉమర్ అలీషాకవి మొదలైనవారు చల్లపల్లి (దేవరకోట) సంస్థానాన్ని దర్శిస్తూ ఉండేవారు. ఈ సంస్థానంలో విలసిల్లిన కవులలో ముక్తేవి పెరుమాళ్ళయ్య, కాసుల పురుషోత్తమ కవి మొదలైనవారు ముఖ్యులు. |