పొడుపు కథలు
పొడుపు విడుపు
చన్నులేని ఆవుపాలు
చెయ్యిలేని వాడు పిండె
అగ్నిలేని పాలుకాగె
నోరులేని బాల తాగె
వాన
పొద్దున లేస్తూనే
నల్లపిట్ట బావిలో పడింది
బొక్కెన
మూడుకాళ్ళ ముద్దప్ప
ముందరేసి రుద్దప్పా
సానరాయి
వెయ్యి గోవుల మంద
ఒక్కటిగా చేరింది
వేసింది ఒక పెద్ద
తియ్యని ముద్ద
తేనెపట్టు
పచ్చపచ్చనిది అదే
పసుప్పూసుకునేది అదే
దేశం తిరిగేది అదే
దేవుని పక్కన పడుకునేదదే
బంతిపువ్వు
కాయ కాని కాయ ఎండ్రకాయ
నూరుగురు అన్నదమ్ములకు ఒకటే మొలతాడు చీపురు తాడు
బక్క కుక్కకు బండెడు పేగులు మంచం
పెద్దన్న ఇచ్చెనూ పచ్చల్ల గొడుగు
పచ్చల్ల గొడుగుకూ పగడాల పూలు
ఆకాశం , నక్షత్రాలు
తోకాయగారికి కోపం వస్తే ఆకాశానికి పరుగులు తీస్తాడు తారాజువ్వ
ముందరి పేజి      తరువాతి పేజి