పొడుపు
|
విడుపు
|
చిటుకు పొటుకులాడి
గోడదుంకే లేడి
|
విస్తరాకు
|
భోగపుదాన బొచ్చులదాన
కొనవిచ్చని పువ్వేది
|
అరటిపువ్వు
|
తట్టుకు మారుతట్టు
నీ పక్కనున్నదేమిటి
|
నీడ
|
మారుతట్టు మల్లయ్య
ముడ్డి దేకయ్య
|
పార
|
మారుతట్టు మల్లప్ప
నీ ముడ్డి గిల్లప్ప
|
గోరుచిక్కుడుకాయ
|
రసరసాలు తిన్న
రాజు కడుపులో పేగుల్లేవు
|
పళ్ళెం
|
ఎగువో పలకా దిగువో పలకా
పలకలకింద మెలికల పామూ
పామును పట్టా పగ్గం లేదు
పగ్గెలు పలికే సిగ్గొదినా
|
నాలుక
|
ఎనిమిది చేతుల ఏబ్రాసి
ఎపుడు తిరిగే సోబ్రాసి
వెన్నున జందెం వేళ్ళాడుతూ
తీసిన కొద్దీ తేర్లాడు
|
రాట్నం
|
భూమిమీద పొర్లాడుతుంది
గాలికి నోరావలించి గబుక్కున మింగుతుంది
నడినెత్తి మీద మంట మండిస్తుంది
అది ఏమిటో చెప్పుకోండి పిల్లలూ
|
కొలిమితిత్తి
|
గుడిచుట్టూ తిరిగి
గుళ్ళో వుచ్చపోసె
|
కొబ్బరికాయ
|
ముందరి పేజి |
తరువాతి పేజి |