పొడుపు
|
విడుపు
|
చెట్టు మీద పిట్ట వాలె
పిట్టవాలగా పట్టుకొంటి
పట్టుకొంటే గిచ్చిపెట్టె
గిచ్చిపెడితే విడిచి పెడితి
|
ముళ్ళ వంకాయ
|
జంటల జంటల కూర
జగన్నాథం కూర
ముంచినా మునగదు
ముత్యాల కూర
|
వెన్న ముద్ద
|
దోసెడు నీళ్ళలో
దొరసాని జలకాలాడుతోంది
|
వెన్న ముద్ద
|
నాగస్వరానికి లొంగని నాగేంద్రుడు
నిప్పంటుకుంటే బుస్సుమంటాడు
|
చిచ్చుబుడ్డి
|
పచ్చ పచ్చల కుండ, పగడాల కుండ
లచ్చమ్మ చేయించు లక్ష వరాల కుండ
|
ఐరేని కుండ
|
పీస్ పీస్ పిట్ట
నేల కేసి కొట్ట
|
చీమిడి
|
పొడల పొడల బువ్వ, పొంకమయిన గువ్వ
బువ్వలోకి మొవ్వ, పురుగులు తినే అవ్వ
రాజులు పొడిచే చివ్వ, రాత్రి తెలిపే రవ్వ
నున్ననైన గువ్వ, నూకలు తినే తవ్వ
|
కోడిపుంజు
|
మంచం కింద మావయ్యా
ఊరికి పోదాం రావయ్యా
|
చెప్పులు
|
ముక్కు మీద కెక్కూ, ముందరి చెవులు నొక్కూ
టక్కుల నిక్కుల పొక్కూ, జారిందంటే పుటుక్కూ
|
కళ్ళజోడు
|
ముందరి పేజి |
తరువాతి పేజి |