పొడుపు కథలు
పొడుపు విడుపు
ఓహోహో బాలమ్మా
ఒళ్ళంతా ముళ్ళమ్మా
కరకర కోస్తే
కడుపంతా తీపమ్మా
పనస పండు
కాయ మీద మాను, కడు రమ్యమై యుండు
మాను మీద లతలు మలయుచుండు
లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు
దీని భావమేమి తిరుమలేశ !
వీణ
అడవిని పుట్టాను
నల్లగ మారాను
ఇంటికి వచ్చాను
ఎర్రగ మారాను
కుప్పలో పడ్డాను
తెల్లగ మారాను
బొగ్గు
అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
చెంబులో నీళ్ళన్ని
చెడ త్రాగుతుంది
గంధపు చెక్క
ఇంటివెనక వెంపలి చెట్టు
యే కాయ కాయమంటే
ఆ కాయే కాస్తుంది
కుమ్మరి సారె
ఎక్కలేని మానుకు దిక్కులేని కాఫు మిరప చెట్టు
కతకత కంగు
కామరాజు పింగు
తోలుతీసి మింగు
అరటి పండు
చక్కచక్కని చెంబు, చారల్ల చెంబు
ముంచితే మునగని ముత్యాల చెంబు
దోసకాయ
చాప చుట్టనూ లేము
చంక బెట్టనూ లేము
ఆకాశం
చుక్కల చుక్కల గుర్రాలెక్కి
సూటి కర్రా చేతా బట్టి
ఆకుల్లేని అరణ్యానికి
రాకుమారుడు వేటకు వెళ్ళె
చందమామ
ముందరి పేజి      తరువాతి పేజి