" వేమన పద్యములు "
అడవులఁ గొండలన్నదులఁదిరుగుచు మనుజుడు కష్టజీవుఁడై,
గడ్డము, గోళ్ళు, తల ,కొంగసిగలును, భూతి రేకలుందాల్చి తపంబు
సేయగనునట్టిదె. యొడలున మట్టిపుట్టలు గలుఁగ జేయుట వ్యర్ధము.
వెఱ్ఱివిధంబునఁ బోవుటయు వట్టిదేసుమా ? లేదు; లేదు, యిది కొం
డెము జెప్పుటకాదు. ఈశ్వరసాక్షిగఁబల్కుచున్న దీని నిక్కము జేసి
కొన్న వారికే దక్కును.ముక్తి సులభము. గట్టిగనమ్ము మటంచు
నాత్మలో జెప్పినమాట మనుజులకుఁజిక్కునె ? చిక్కదు. వెఱ్ఱి వేమనా !