" వేమన పద్యములు "
అచ్చుపడఁగ మనసు | మచ్చికచేఁబట్టి
ముచ్చటించి శివుని | మూర్తిఁజూపి;
కుచ్చితంబు మాన్పి | చొచ్చుటే యోగంబు
విశ్వదాభిరామ వినుర వేమ.