" వేమన పద్యములు "
అచల సూచనెంతొ | యధికారిచేగాని
యందఱికినిఁదోప | దమ్మలార !
యందియున్నఁగాని | యనువుఁదెలియరాదు
విశ్వదాభిరామ వినుర వేమ.