" వేమన పద్యములు "
అంగ మెల్లవదలి | యటుదంతములు నూడి
తనువు ముదిమిచేతఁ | దఱచు వడక
ముప్పు త్రిప్పలఁబడి | మోహంబు విడువరు
విశ్వదాభిరామ వినుర వేమ.