" వేమన పద్యములు "
అక్షరంబెఱుఁగని | యాచారమదియేల ?
తాను దినని యట్టి | ధనమదేల ?
నొరుల మేలుఁ జూచి | యోర్వని తనువేల ?
విశ్వదాభిరామ వినుర వేమ.