" వేమన పద్యములు "
అక్షమాలఁబూని | యలమటఁ జెందక;
కుక్షి నింపు కొనుట | కొదువఁగాదు;
పక్షి కొంగరీతిఁ | బైచూపు లేఁటికో
విశ్వదాభిరామ వినుర వేమ.