" వేమన పద్యములు "
అందునిందు ననక | నన్నిటఁ బరికింప
విష్ణు వెలయుచుండు | విదితముగను;
చక్రి తిరుగు భూమి | చక్రంలోపల
విశ్వదాభిరామ వినుర వేమ.