" వేమన పద్యములు "
అంతరంగ హృదయ | మందఁగా సాధించి
చింత లూడఁబెఱికి | చిక్కుపడక
వింతఁజూచిమెలఁగి | విజ్ఞాన మందరా
విశ్వదాభిరామ వినుర వేమ.