" వేమన పద్యములు "
ఆ. అంగమందు లింగ | మతిశయంబుగఁ గట్టి
(1) లింగమందు భక్తి | (2) నిలుపలేడు
ముక్తి లేక తుదను | మూర్ఖుడై పోవురా
విశ్వదాభిరామ వినుర వేమ
పాఠాంతరము:-
(1)లింగమందు ముక్తి | లేఁడు నిలుప
(2) యతి తప్పినది.