" వేమన పద్యములు "
అండజములఁబుట్టు | నలరు ప్రాణులుకొన్ని
బుద్బుధములఁబుట్టు |పురుగులెల్ల
స్వేదముననుఁబుట్టు | జీవులు కొన్నిరా
విశ్వదాభిరామ వినుర వేమ.