" వేమన పద్యములు "
అంజనంబుఁబెట్టి | యాత్మలో ద్రవ్యంబుఁ
గనఁగలేని ఘనత | కడఁగి యెఱిఁగి
ఆశఁ దప్పినప్పు | డతఁడెపో ఘనయోగి
విశ్వదాభిరామ వినుర వేమ.