ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఈ పుట భారతేతిహాసాలకు అంకితం.ఆ పురాణాల ఆడియోలు, వీలైతే ఆ పుణ్యమైన ఐతిహాసిక పాఠాలు మీముందుకు తీసుకునిరావాలన్న ప్రయత్నమిది. ఉషశ్రీగారి గళంలో జాలువారిన భాగవతము, రామాయణం, మహాభారతము ఆడియోలు అందించిన డాక్టర్ చెముటూరి నాగేంద్ర గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. వీరు యూనివర్సిటీ ఆఫ్ ఐయోవాలో పనిచేస్తున్నారు.
ఈ ఆడియోలకు తన అమృతగళాన్ని అందించి జీవంపోసిన ఉషశ్రీ (మార్చి 16, 1928 - సెప్టెంబరు 7, 1990) అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 (ప్రభవ తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 (ఫాల్గుణ బహుళ త్రయోదశి) న జన్మించారు. తండ్రి శ్రీ పురాణపండ రామ్మూర్తి . తల్లి శ్రీమతి అన్నపూర్ణ.
ఈ ఆణిముత్యాలు ఇక్కడ ప్రచురించటం ఎవరికైనా అభ్యంతరకరమైతే తెలియపర్చండి..క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను...అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
ఆడియోలు ఇక్కడ ప్రచురించిన సంవత్సరం: 2010
|
భారతీయ వాఙ్మయంలో రామాయణం ఆదికావ్యం. ఆ ఇతిహాసాన్ని, మహాకావ్యాన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగా సుప్రసిధ్ధం. అన్ని భారతీయ భాషల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం.
రామాయణ కావ్యంలోని విభాగాలు సంక్షిప్తంగా ఇవీ -
1 బాలకాండము
2 అయోధ్యా కాండము
3 అరణ్యకాండము
4 కిష్కింధకాండము
5 సుందరకాండము
6 యుద్ధకాండము
7 ఉత్తరకాండము
ఆ రమణీయ కావ్యం ఉషశ్రీ గారి గళంలో
|
బాలకాండ - పుత్ర కామేష్ఠి, శ్రీరామ జననం, తాటక వధ, విశ్వామిత్ర యాగ సంరక్షణ |
అహల్యా శాప విమోచనం, సీతా కల్యాణం, పరశురామ గర్వభంగం, శ్రీ రామ పట్టాభిషేక యత్నాలు |
అయోధ్యా కాండ - మందర దుర్బోధలు, కైకేయి అలుక, దశరథ నిర్యాణం, పాదుకా పట్టాభిషేకం |
అరణ్య కాండ - బంగారుజింక ప్రలోభం, మారీచ వధ, సీతాపహరణం, సుగ్రీవ సమాగమం |
కిష్కింధ కాండ - వాలి వధ, తారా విలాపం, లక్ష్మణుని ఆగ్రహం |
సుందర కాండ - హనుమంతుని విశ్వరూపం, సముద్ర లంఘనం, సింహికా సంహారం, లంకానగర సౌందర్యం |
ఆంజనేయుని లంకా ప్రవేశం, పుష్పక విమాన వర్ణన, అశోకవనంలో సీతా సందర్శనం, త్రిజట స్వప్నం |
యుద్ధ కాండ - లంకా దహనం, సేతు నిర్మాణం, ఇంద్రజిత్తు పోరు, కుంభకర్ణుని వధ |
రామ రావణ సంగ్రామం, లక్ష్మణ మూర్ఛ, సంజీవ పర్వతం, రావణ సంహారం |
విభీషణ పట్టాభిషేకం, సీత అగ్ని ప్రవేశం, శ్రీరామ పట్టాభిషేకం, స్వస్తి |
భాగవతం ఆడియోలు మహాభారతం ఆడియోలు
|
|