ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఈ పుట భారతేతిహాసాలకు అంకితం.ఆ పురాణాల ఆడియోలు, వీలైతే ఆ పుణ్యమైన ఐతిహాసిక పాఠాలు మీముందుకు తీసుకునిరావాలన్న ప్రయత్నమిది. ఉషశ్రీగారి గళంలో జాలువారిన భాగవతము, రామాయణం, మహాభారతము ఆడియోలు అందించిన డాక్టర్ చెముటూరి నాగేంద్ర గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. వీరు యూనివర్సిటీ ఆఫ్ ఐయోవాలో పనిచేస్తున్నారు.
ఈ ఆడియోలకు తన అమృతగళాన్ని అందించి జీవంపోసిన ఉషశ్రీ (మార్చి 16, 1928 - సెప్టెంబరు 7, 1990) అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 (ప్రభవ తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 (ఫాల్గుణ బహుళ త్రయోదశి) న జన్మించారు. తండ్రి శ్రీ పురాణపండ రామ్మూర్తి . తల్లి శ్రీమతి అన్నపూర్ణ.
ఈ ఆణిముత్యాలు ఇక్కడ ప్రచురించటం ఎవరికైనా అభ్యంతరకరమైతే తెలియపర్చండి..క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను...అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
|
మహాభారతం పంచమ వేదము గా పరిగణించబడే భారత ఇతిహాసము. ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగు లోకి అనువదించారు. ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు.ఆ రమణీయ కావ్యం ఉషశ్రీ గారి గళంలో
|
ఆది పర్వం |
సభా, అరణ్య, విరాట పర్వాలు |
విరాట పర్వం |
ఉద్యోగ పర్వం - 1 |
ఉద్యోగ పర్వం - 2 |
ఉద్యోగ పర్వం - 3 |
భీష్మ పర్వం |
ద్రోణ పర్వం, కర్ణ పర్వాలు |
కర్ణ , శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు |
శాంతి, అనుశాసనిక, అశ్వమేధ పర్వాలు |
మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వాలు |
|