శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


తుమ్మెదబారు

తుమ్మి పూదెనె తెగద్రావి
జుమ్ముమంచు
పారిపోయెడి
తుమ్మెద బారు గనుము;
చెలియ వాసంత లక్ష్మి
కైసేసికొన్న
ఝణ ఝణల మ్రోయు
మొలనూలు చాయనుండె

-- ప్రాకృతం - సప్తశతి