శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


చలువలతేరు

రజత పంజరమ్ములోని
రాజహంస పోలికన్,
మందరాద్రి కందరమున
మసలు సింహ మట్టులన్
మత్త గజము పయినెక్కిన
మహారథుని చాడ్పునన్
మింటనున్న చందమామ
మెఱయుచుండె వెలుగులన్

-- సంస్కృతం - వాల్మీకి రామాయణం