శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


వేకువరేకులు

చీకట్లను కప్పుతున్న
ఆకాశపు టంచుల,నా
లోకవిషయ మొనరించుచు
రేకులుగా విడుగుతోంది.
తన చెల్లెలు రేయి కన్నె
కను గబగబ తరుముతోంది;
మనుషుల యుగము, లొకక్కటి
గను ముక్కలు చేస్తున్నది.
హృదయేశ్వరు దీప్తిచ్చట
మెదలుతోంది మిసమిసమని
అదిగదిగో ఉషఃకన్య
ఉదయిస్తున్నది సఖుడా

-- వైదికం - ఋగ్వేదం