శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


ఎండ

తలచిన డెందము గందును,
బలికిన నోరెల్ల బొక్కు
బ్రభ సూచిన రెప్పలు గమరు,
ననగ, బటుతర
విలయానల భాతి
నెండ, వేసవి గాచెన్.
ఉరు నిదా ఘాతసాహతి,
గరుల తలలు వ్రస్సి
లోపలి ముత్యముల్
వరుస మెఱసి,
మంగలములోని
పేలాల భంగి దూలి
ప్రేలిపడ గాసె
గట్టెండ పిడువరించి

-- తెలుగు - నన్నెచోడుడు