శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన "భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు |
శ్రుతిదప్పిన వల్లకి ధూమ సంవృత వహ్ని శిఖా మతల్లి రమణ, నలిగిన పీతాంబరంబు నొకటి గట్టుకొని యున్న జానకీ కాంత, నంత కన్గొనియె నంజనాదేవి కన్నకొడుకు. **** శారదాభ్ర పరీవృత చంద్రరేఖ వాడకము లేక తంటులు వదిలి పోయి శ్రుతిని దప్పిన వల్లకి సొరగి పోయి యున్న జానకి, నాంజనేయుండు చూచె. - పౌరాణికం - వాల్మీకి |