శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


మేల్కొల్పు

మేలుకొండీ జనుల్
మేలుకొండీ నరుల్
మన జీవ రక్షకుడు
చనుదెంచు చున్నాడు;
చీకటులు విచ్చినవి
వేకువలు విరిసినవి,
రవివచ్చు మార్గమును
సవరించిన దుషస్సు.
ఎచట నన్నము దొఱకు
నచటి కేగుద మింక
మేల్కొనుడు! మేల్కొనుడు!
మేల్కునుం డిక జనులు!

- వైదికం - ఋగ్వేదం