శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


చంద్రమా.....

వాడి కొమ్ములతో నున్న
కోడెవొలె,
ఉచ్చశృంగమ్ము లను గల్గు
నుర్వి ధరము పోల్కి
బంగరు పూతకొమ్ముల
మదేభ సరణి,
కొమ్ములుదీరి
చందురుడు వొలిచె
కొండ నెక్కిన
సింగంపు కొదమ వోలె
రణము జొచ్చిన మత్తేభ రాజమట్లు
రాజ్యమబ్బిన
రాజ సుత్రాము మాడ్కి
చదల వెలుగొందె నప్పుడు
చందమామ

-- సంస్కృతం - వాల్మీకి రామాయణం