శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


దావాగ్ని

పొడల దుప్పివలె చిత్రము,
ప్రొద్దువోలె సందృశ్యము
పరమాయువు వడుపున జీ
వ రసాయన వరము;
అరణ్యమున కన్నకొడుకు
కరణి, ఆపు కదుపువొలె
పరుగులెత్తు దావాగ్నికి
కరాంజలిని ఘటియించెద

-- వైదికం - ఋగ్వేదం