శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


అహోరాత్రులు

దివా రాత్రముల కొకటే,
దివ్యపథం. అనంతమది
దివ్య సోదరీమణులౌ
దివా నిశీధిను లిద్దరు,
తివిరి ఒకరి వెనుక నొకరు
పవలు రేలు తిరుగుచంద్రుః
అవిరతులై ఒక్క నిమిష
మాగని వేగమ్ముతో
ఆకారా ల్వేరు గాని
ఆంతర్యం ఏకైకం
ఆ రెంటికి, ఆ జంటకు

-- వైదికం - అథర్వవేదం