శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


కోరిగ

ఒక్క వరమిదియే
కోరుచున్న వాడ!
కొదమ తుమ్మెద గమి
రొద నదరిపోవు
నీవు నివసించు కొండల
నెలవులందు
నేను చంపకమై
పుట్టనిమ్ము దేవ!

- తమిళం - కురశేఖర పెరుమాళ్