శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


మధురభావన

నెమలి కేకలను వినివిని
నెమ్మది చిల్లులువడెనే,
చిలుక పాటలను వినివిని
చెవులు మూటవడెనే.
కోయిల కూతలు గాలిని
కోకోయని యనెనే.
మెఱపు మెఱసెనే, మబ్బులు
ఉఱుము లుఱిమి చనెనే
చిటచిట చినుకులు పడెనే
చీరచెఱగు తడిసెనే.
చిన్ని గోపబాలుని యీ
చిన్నెల నే మందునే___
గోపాలుడు నా హృదయము
కొల్లగొట్టి పోయెనే___

-- హిందీ - మీరా