శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


డోలాయమానత

ఇటు జూడన్ రఘురాము,
డట్లుగన వాడే లక్ష్మణుం,
డింక నక్కట!
నెచ్చో దమిదీర్చుకొందు
నని, రక్షఃకాంత యల్లాడె;
నిట్టటుగూడన్
నునుపచ్చికం గని
యిటట్టై, గట్టుపై ధేను
వచ్చటి కిచ్చోటికి నూరకే
దిరుగు నోజన్
గంపిత స్వాంతయై

-- సంస్కృతం - భోజరాజు