శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


రసహృదయం

దిగంతాల గర్జించే
అగాధాలలో
జలజల సెలయేరు గుండె
జలదరించునూ.
నులివెచ్చని నీ రెండల
పలకరింపులో,
పుడమి బొడుచు పూవురేకు
పులకరించునూ.
గాటమైన మృత్యుదేవి
కౌగిలింతలో,
కలకలమను జీవితమ్ము
కరగిపోవునూ.
వలపు లులుకు నీ తలపుల
కలవరింతలో,
సొమ్మసిల్లు నా యెడంద
సొక్కిపోవునూ

-- తమిళం - పొఘై ఆళ్వార్